ఖాతాదారులకు శుభవార్త వినిపించిన 'ఆర్బీఐ'
By సుభాష్
ఖాతాదారులకు ఆర్బీఐ తీపి కబురు అందించింది. ఇకపై బ్యాంకు ఖాతాదారులు తమ డబ్బులను 24గంటల్లో ఎప్పుడైన పంపుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ రోజు నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్) సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.ఈ సేవలు 365 రోజులు ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. కాగా, ప్రస్తుతం నెప్ట్ సేవలు మామూలు రోజుల్లోఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులోఉండేది. మొదటి, మూడో శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సదుపాయం ఖాతాదారులకు అందుబాటులోఉండేది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇక నుంచి ఈ సేవలు అర్ధరాత్రి 12.30 నుంచి రాత్రి 11.30 వరకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక పండగ రోజులు, సెలవు దినాలు అనే వాటితో సంబంధం లేకుండా ఏ క్షణమైనా నగదును బదిలీ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాదు.. నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీలు కూడా లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా నెఫ్ట్ విధానంలో ఖాతాదారులకు లిమిట్ లేకపోగా.. ఆర్టీజిస్ విధానంలో మాత్రం 2 లక్షల రూపాయల వరకు నగదును బదిలీ చేసుకుని వెసులుబాటు ఉంది.