దేశవ్యాప్తంగా 'నీట్ ' ఒక్కటే

By Newsmeter.Network  Published on  3 Dec 2019 8:54 AM GMT
దేశవ్యాప్తంగా నీట్  ఒక్కటే

దేశవ్యాప్తంగా వైద్యవిద్యకు ఒకటే ప్రవేశ పరీక్షా నీట్. వైద్యవిద్యకు సంబంధించి గత సంవత్సరం వరకు కూడా ఎయిమ్స్ , జిస్ మార్ వంటి స్వతంత్ర సంస్థలు ఎంబిబిఎస్ వైద్య ప్రవేశ పరీక్షలను స్వతంత్రంగా నిర్వహించారు. 2020 -21 సంవత్సరం నుండి దేశం లోని అన్ని వైద్య సంస్థలో నీట్ ప్రవేశ పరీక్ష ప్రామాణికంగా ఉంటుందని జాతీయ పరీక్షల సంఘం తెలిపింది.

అదేవిదంగా విదేశాలలో వైద్యవిద్య అభ్యశించాలి అనుకునే విద్యార్థులు నీట్ లో అర్హత సాదించాలి. ఈ నెల 2 నుండు 31 వరకు దరఖాస్తు స్వీకరణ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. వచ్చే సంవత్సరం మే ౩ న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామన్నారు.జూన్ 4 న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. మర్చి 27 అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. దేశవ్యాప్తంగా పరీక్షను ఆగ్లం, హిందీ, తెలుగు, కన్నడ, అస్సామీ, గుజరాతి, బెంగాలీ, ఒడిశా, ఉర్దూ, మరాఠి,తమిళ్ భాషలో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

అదేవిధంగా తెలంగాణాలో హైదరాబాద్, కరీంనగర్,వరంగల్,ఖమ్మం, రంగారెడ్డి కేంద్రాలుగా నీట్ పరీక్షా నిర్వహిస్తారని తెలిపారు. ఎంబిబిఎస్, దంత, యునాని, సిద్ద, ఆయుర్వేదం, హోమియోపతి నీట్ పరిధిలోకి వస్తాయని తెలిపారు.

దరఖాస్తు రుసుము:

జనరల్: రూ.1500 జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబిసి-నాన్ క్రిమి లేయర్ రూ. 1400 ఎస్టీ, ఎస్సి, దివ్యంగులు, ట్రాన్సజండార్ కు రూ. 800 వీటికి జీఎస్టీ, ప్రోసెసింగ్ ఫీజ్ కూడా ఉంటుందని తెలిపారు.

Next Story