ఏపీలో ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలు తీస్తుందని టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలతో అన్నారు. ఆత్మహత్యలే తమకిక శరణ్యమంటూ ఓ నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన సెల్ఫీ వీడియోను చంద్రబాబు ట్విట్ చేశారు. ఐదు నెలలుగా పనులు లేక, కుటుంబాలు పస్తులుండటం చూడలేక మనసు కలచివేస్తోందన్నారు చంద్రబాబు,. సెల్ఫీ వీడియోల్లో ఆత్మహత్యలే తమకిక శరణ్యమని పేర్కొనడం చూసైనా ప్రభుత్వం మేల్కోవాలి అని ట్విటర్ లో చంద్రబాబు అన్నారు.