లాడ్జిలో నాటువైద్యం.. వైద్యం వికటించడంతో..
By Medi Samrat Published on 15 Oct 2019 6:05 PM ISTముఖ్యాంశాలు
- ముగ్గురి పరిస్థితి విషయం
బెజవాడలో నాటువైద్యం పేరుతో దారుణం చోటుచేసుకుంది. యూ ట్యూబ్ ద్వారా బుద్ధి మాంద్యానికి చికిత్స చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చాడు ఓ నాటు వైద్యుడు. ఆ ప్రకటనను చూసిన కడప జిల్లాకు చెందిన హరనాథ్ అనే బాలుడు వైద్యానికి వచ్చాడు. వైద్యం వికటించి మృతి చెందాడు.
బుద్ధి మాంద్యానికి చికిత్స చేస్తామంటూ గవర్నరుపేట లోని గంగోత్రి లాడ్జిలో మూడు గదులు తీసుకుని నాలుగు రోజులుగా చికిత్సలు చేస్తున్న నాటు వైద్యుడు. చికిత్స పొందేందుకు కృష్ణాజిల్లా ఏఎమ్‌డీఏ అసోసియేషన్ ద్వారా బెంగళూరు, బళ్లారి, తెలంగాణ, కడప ప్రాంతాలనుండి నగరానికి 11మందికి పైగా వచ్చారు. అయితే చికిత్స పొందుతున్న నలుగురిలో ఒక బాలుడు మృతి చెందగా మరో ముగ్గురు పరిస్థితి విషమం వుందని బాధితులు తెలిపారు. విషమంగా ఉన్న బాధితులను విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. నాటు వైద్యుడు భూమేశ్వరరావును పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.