నాని చిత్రానికి ముహుర్తం ఫిక్స్

By Newsmeter.Network  Published on  29 Nov 2019 8:33 AM GMT
నాని చిత్రానికి ముహుర్తం ఫిక్స్

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'వి' అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిన్నుకోరి, మ‌జిలీ చిత్రాల ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ చెప్పిన క‌థ‌కు నాని ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. ఇందులో నాని పాత్ర చాలా డిఫ‌రెంట్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాని డిసెంబ‌ర్ 1న ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. ఈ మూవీని శివ నిర్వాణ‌తో మ‌జిలీ చిత్రాన్ని నిర్మించిన స‌న్ షైన్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. సాహు గార‌పాటి, శిరీష్ పెద్ది నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాలో న‌టించే ఇత‌ర న‌టీన‌టుల ఎవ‌ర‌నేది త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు.

దీనికి గోపీ సుంద‌ర్ సంగీతం అందించ‌నున్నారు. నిన్నుకోరి, మ‌జిలీ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి.. అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి.

Next Story
Share it