కరోనా కారణంగా లాక్ డౌన్ విధింపుతో సినిమాలు, సీరియళ్లు, రియాలిటీ షో లు ఇలా అన్ని షూటింగ్ లు నిలిచిపోయాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. మామూలుగా అయితే వాళ్ల బిజీ బిజీ షూటింగ్ షెడ్యూళ్లతో కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే తీరికే ఉండదు. అలాంటిది లాక్ డౌన్ కారణంగా 21 రోజులు కుటుంబంతో ఉండే సమయం దక్కింది. ఇంట్లో ఉంటూ పరిశుభ్రత పాటిస్తూ..కుటుంబ సభ్యులతో ముఖ్యం తమ గారాలపట్టీలతో సమయం గడిపేస్తున్నారు స్టార్ హీరోలు. అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. లాక్ డౌన్ సమయంలో తామెలా గడుపుతున్నారో చెప్తూ..వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

Also Read : ఎంతోమందికి ఆకలి తీరుస్తున్న రతన్ టాటా జీవిత చరిత్ర..

ఆదివారం నేచురల్ స్టార్ నాని తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా చేసిన సందడిని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘ఊరికే అలా.. జున్ను గాడితో..’ అంటూ కొడుకుతో తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే కొడుకుతో దిగిన ఫొటోను ట్వీట్టర్ లో పోస్ట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, వారిద్దరి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

Also Read : ఏపీలో కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసులు

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘వి’ సినిమాలో నాని నటించారు. సుధీర్‌బాబు, అదితిరావు హైదరీ, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఉగాది కానుకగా విడుదలవ్వాల్సి ఉండగా..కరోనా కారణంగా విడుదల తేదీ వాయిదా పడింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.