దిగి వస్తున్న బంగారం ధరలు
By సుభాష్ Published on 13 Oct 2020 1:06 PM ISTబంగారం ధరలు దిగివస్తున్నాయి. గత మూడు రోజులుగా పెరిగిన పసిడి ధరలు మంగళవారం దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధరపై రూ.237 తగ్గి రూ.50,870కి చేరింది. ఇక కిలో వెండి పై కూడా రూ.525 తగ్గిపోయి ప్రస్తుతం రూ.62,573కు క్షీణించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు ఔన్స్‌కు 1919 డాలర్లకు పడిపోయాయి.
కాగా, పసిడి ధరలు మరింత పతనమయ్యే దశలో కరోనా వైరస్ కేసులు పెరగడం, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ పరీక్షలు నిలిచిపోవడంతో బంగారం ధరలు కొంతమేర పుంజుకున్నాయి. ఇంక అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం ధరలు మరికొంత కాలం ఒడిదుడుకులతో సాగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Next Story