ఢిల్లీ పని అయిపోయింది.. అమరావతిని దేశ రాజధాని చేయాలి: కాంగ్రెస్‌ నేత సింఘ్వీ ట్వీట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 9:19 AM GMT
ఢిల్లీ పని అయిపోయింది.. అమరావతిని దేశ రాజధాని చేయాలి:  కాంగ్రెస్‌ నేత సింఘ్వీ ట్వీట్

ముఖ్యాంశాలు

  • అమరావతిని దేశ రాజధాని చేయాలంటూ కాంగ్రెస్ నేత సింఘ్వీ ట్వీట్
  • రాంచీని కూడా పరిశీలించవచ్చన్న సింఘ్వీ
  • ఢిల్లీలో వనరులు తరిగిపోయాయి, వాయు కాలుష్యంతో ఇబ్బందులు అంటూ ట్వీట్

ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. 15 రోజుల నుంచి ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటకు అడుగు పెట్టాలంటేనే భయ పడుతున్నారు. విమానాలను దారి మళ్లిస్తున్నారు. మధ్యయుగాల్లో విదేశీయులు ఢిల్లీని ఆక్రమించుకుంటే..ఇప్పుడు వాయు కాలుష్యం ఢిల్లీపై దాడి చేసి ఆక్రమిస్తుంది. కొన్ని రోజులపాటు ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందంటూ ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది. మాస్క్‌, కళ్ల అద్దాలు పెట్టుకుని బయటకు వెళ్తున్నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాయు కాలుష్యానికి పొగ మంచు కూడా తోడవ్వడంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Delhi2

ఇంకా...దేశ రాజధాని ఢిల్లీ పాకిస్తాన్‌కు చాలా దగ్గరగా ఉంది. చైనాకు దగ్గరగా ఉంది. పాకిస్థాన్‌, చైనా రెండు మనకు శత్రుదేశాలే. చైనా మన భుజం మీద చేయివేసి తిరిగినప్పటికీ డ్రాగన్‌ కంట్రీని అంతగా నమ్మలేం.సో..యుద్ధమంటూ వస్తే..పాకిస్థాన్‌, చైనా అయినా మొదట ఢిల్లీనే టార్గెట్ చేస్తాయి. సో..దేశ రాజధానిగా ఢిల్లీ ఎప్పటికీ క్షేమం కాదు అనేది చాలా మంది అభిప్రాయం. ఢిల్లీకి దేశ రాజధానికి కావాల్సిన అర్హతలు ఉండొచ్చు. కనీస సౌకర్యాలు ఉండొచ్చు. కాని..వాతావరణం, రక్షణ అనేవి చాలా ముఖ్యం.

ఢిల్లీని ఆక్రమించిన కాలుష్యం

సరే..ఢిల్లీని రాజధాని కాదనుకుంటే దేశంలోని మెట్రోపాలిటన్ సిటీస్‌లో.. ఏదో ఒకదాన్ని దేశ రాజధానిగా ప్రకటించవచ్చుగా అని చాలా మంది అంటుంటారు.అయితే..దేశంలోని ప్రధాన నగరాలు ముంబై, కోల్‌ కతా, చెన్నై, బెంగళూరు ఇప్పటికే అధిక జనాభాతో, సౌకర్యాల లేమీతో సతమతమవుతున్నాయి. చెన్నైలో చుక్క నీరు దొరకని పరిస్థితి చూశాం. అంతేకాదు..ఇది దేశానికి ఒక మూలగా ఉంటుంది. ఇప్పటికీ మోయలేని జనాభాతో ముంబై సతమతమవుతుంది. ఇక..కొల్‌కతా కూడా ఓ మూలకు ఉంటుంది. కేరళవాడు కోల్‌కతా రావాలంటే కొన్ని రోజులు ప్రయాణానికే సరిపోతుంది. సో..ఢిల్లీ కాకపోతే దేశ రాజధాని అయ్యే అర్హత ఏ ప్రాంతానికి, ఏ సిటీకి ఉంది..?.

Image result for AMARAVATHI

కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ చేసిన ట్వీట్ ఆలోచింపచేసే విధంగా ఉంది. ఢిల్లీ పని అయిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీ, ఏపీ రాజధాని అమరావతిని దేశ రాజధానులుగా పరిశీలించవచ్చంటూ ట్వీట్ చేశారు. ఈ రెండు నగరాలనే సింఘ్వీ దేశరాజధానులుగా చెప్పడం వెనుక కారణం ఉంది. రెండూ కొత్తగా ఏర్పడుతున్న నగరాలు. ఇప్పుడిప్పుడే వనరులు, మౌలిక సదుపాయాలు సమకూర్చుకుంటున్నాయి. సో..మంచి ప్రణాళికతో మొదటి నుంచే ఈ నగరాలను నిర్మించడానికి అవకాశం ఉంటుందనేది సింఘ్వీ ఆలోచన కావొచ్చు.ఇక..కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో అమరావతికి చోటే కల్పించలేదు. మరోవైపు..కాంగ్రెస్ సీనియర్ నేత సింఘ్వీ దేశ రాజధానిగా అమరావతిని పరిశీలించాలి అంటున్నారు . అమరావతి చుట్టూ ఎన్ని రాజకీయాలు తిరుగుతున్నా..ఈ ప్రాంతానికి ప్లస్ పాయింట్లు ఉన్నాయి.అవేంటో చూద్దాం. అమరావతి సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుంది. దీంతో జలరావాణకు, విదేశీ నేతలు రాకపోకలకు ఇబ్బంది ఉండదు. ఇక..చెన్నై, బెంగళారు, హైదరాబాద్‌, భువనేశ్వర్‌కు చాలా దగ్గరగా ఉంటుంది అమరావతి. ముంబై నుంచి అమరావతి, అమరావతి నుంచి చెన్నై, చెన్నై నుంచి త్రివేండ్రం రోడ్డు మార్గాలకు ఇబ్బంది ఉండదు. బెంగళారు నుంచి అమరావతికి రోడ్డు మార్గంతో కనెక్ట్ చేయవచ్చు. ఇక..అమరావతి నుంచి భువనేశ్వర్‌కు సముద్ర తీరం వెంట టూరిజాన్ని దృష్టిలో పెట్టుకుంటూ రోడ్డు వేయవచ్చు. ఇక..అమరావతి - హైదరాబాద్‌కు వయా విజయవాడ ద్వారా ఉన్న రోడ్డును డెవలప్ చేయవచ్చు. ఈ రోడ్డును పుణె, నాగపూర్‌ మీదుగా ముంబై తీసుకెళ్లొచ్చు. ఇలా రోడ్డు మార్గం ద్వారా అమరావతిని దేశం మొత్తానికి కనెక్ట్ చేయవచ్చు.

Image result for INDIA MAP

ఇక నీటికి కొరత ఉండదు. పక్కనే కృష్ణా నది. గోదావరి జలాలను కృష్ణకు తరలించే ప్రతిపాదన కూడా ఉంది. దీంతో.. నీటి అవసరాలకు లోటు ఉండదు. ఇక...వాతావరణం కొంచెం చెమటగా ఉన్నా ..చెన్నై, ఢిల్లీ, కోల్‌కతాల కంటే అమరావతి వాతావరణం బెటర్‌. ఢిల్లీ శత్రు దేశాలకు దగ్గరగా ఉండటం....వనరలు తగ్గిపోతుండటం..రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతుండటంతో అమరావతిలాంటి నగరాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Image result for KRISHNA RIVER

అయితే...రాజకీయ పెత్తనంలో ముందుండే నార్త్ ఇండియన్లు దీనికి ఒప్పుకుంటారా...?అసలు చర్చల్లోకైనా తీసుకు వస్తారా అనేది సందేహామే. ఎందుకంటే..అమరావతిలో దేశ రాజధాని ఉంటే..సౌతిండియా పెత్తనం దేశ రాజకీయాల్లో సహజంగానే పెరుగుతుంది. ట్వీట్ చేసింది కూడా నార్త్ ఇండియన్ అయినప్పటికీ..వాస్తవరూపంలో ఇది ముందుకెళ్తుందా అనేది అనుమానమే...!

- వై. వి. రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

Next Story
Share it