పాక్‌ క్రికెటర్‌కు జైలు శిక్ష

By Newsmeter.Network  Published on  8 Feb 2020 8:42 AM GMT
పాక్‌ క్రికెటర్‌కు జైలు శిక్ష

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ నాసిర్‌ జంషెడ్‌కి 17 నెలల జైలు శిక్ష ఖరారైంది. స్ఫాట్ ఫిక్సింగ్‌ కు పాల్పడినందుకు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు అతనికి ఈ శిక్ష విధించింది. జెంషెడ్‌తో పాటు బ్రిటీష్ జాతీయులు యూసెఫ్ అన్వ‌ర్‌, మొహ‌మ్మ‌ద్ ఇజాజ్‌ల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ నేష‌న‌ల్ క్రైం ఏజెన్సీ ముందు త‌మ నేరాల‌ను అంగీక‌రించారు. ఈ కేసులో అన్వ‌ర్‌కు 40 నెల‌లు, ఇజాజ్‌కు 30 నెల‌ల శిక్ష ప‌డింది. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జంషెడ్ 48 వన్డేలాడి 30.83 సగటుతో 1418 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2015 తర్వాత పాక్ క్రికెట్‌కి దూరమైన ఈ బ్యాట్స్‌మెన్.. ఇంగ్లాండ్‌కి వెళ్లి అక్కడ కౌంటీల్లో ఆడుతున్నాడు. 2019లో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో బ్యాట్స్‌మెన్ షార్జీల్ ఖాన్.. ఓ మ్యాచ్‌లో రెండు బంతులకి పరుగులేమీ చేయకుండా డాట్ చేయాలని ఫిక్సింగ్ చేశారు. ఓ అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్‌లో జెంషెడ్ ప్లాన్ బ‌య‌ట‌ప‌డింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. షార్జీల్‌పై ఐదేళ్లు, జంషెడ్‌పై పదేళ్ల పాటు నిషేధం విధించింది. ఇక జంషెడ్‌తో కలిసి పనిచేసినట్లు తేలిన మరో క్రికెటర్ ఖాలిద్ లతీఫ్‌పైనా ఐదేళ్ల నిషేధం పడింది.

Next Story