ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు

By సుభాష్  Published on  22 Oct 2020 4:01 AM GMT
ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు నిర్వహించనన్నట్లు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం నాయిని భౌతిక కాయాన్ని మినిస్టర్‌ క్వార్టర్స్‌కు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా, సెప్టెంబర్‌ 28న కరోనా బారిన పడిన నాయిని.. బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం నెగిటివ్‌ వచ్చింది. అయినా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో ఇబ్బందిగా మారింది. అలాగే శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. పరీక్షల్లో న్యుమోనియా సోకినట్లు తేలడంతో మెరుగైన చికిత్స కోసం ఈనెల 13న ఆయన కుటుంబ సభ్యులు అపోఓలో ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటి నుంచి వెంటిలేటర్‌పై ఉన్న నాయిని.. బుధవారం పరిస్థితి మరింత విషమించింది. దీంతో తుది శ్వాస విడిచారు

Next Story