నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

By సుభాష్  Published on  22 Oct 2020 2:50 AM GMT
నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, కార్మిక శాఖ నేత నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సెప్టెంబర్‌ 28న కరోనా బారిన పడిన నాయిని.. బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం నెగిటివ్‌ వచ్చింది. అయినా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండి, శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. పరీక్షల్లో న్యుమోనియా సోకినట్లు తేలడంతో మెరుగైన చికిత్స కోసం ఈనెల 13న ఆయన కుటుంబ సభ్యులు అపోఓలో ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటి నుంచి వెంటిలేటర్‌పై ఉన్న నాయిని.. బుధవారం పరిస్థితి మరింత విషమించింది. దీంతో తుది శ్వాస విడిచారు.

నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ గ్రామంలో నర్సింహారెడ్డి జన్మించారు. నాయినిది వ్యవసాయ కుటుంబం. నాయిని తుది శ్వాస విడిచే వరకు కార్మికలోకానికి సేవలందిస్తూ హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానే ఉన్నారు. 1996 నాటి తొలి తెలంగాణ ఉద్యమంలో నాయిని కీలకంగా వ్యవహరించారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశ వ్యాప్తంగా విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సోషలిస్ట్‌ పార్టీ నేతగా ఉద్యమం సాగించారు. తెలంగాణ ఆవిర్భావ నుంచి తుదిశ్వాస వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. 1978,1985,2004లలో ముషీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2005-2008 వరకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో, 2014-2019 వరకు కేసీఆర్‌ మంత్రివర్గంలో ఉన్నారు.

Next Story