న‌రేష్ 'ర‌ఘ‌ప‌తి వెంక‌య్య నాయుడు' సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 12:46 PM GMT
న‌రేష్ ర‌ఘ‌ప‌తి వెంక‌య్య నాయుడు సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'రఘుపతి వెంకయ్య నాయుడు'. ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా పిలవబడే రఘుపతి వెంకయ్య జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ..

రఘుపతి వెంకయ్య గారి పాత్రలో నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికున్నంత వరకు ఈ చిత్రం అందరికీ గుర్తుండిపోతుంది అన్నారు.

దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ..

తెలుగు సినిమా కోసం రఘుపతి వెంకయ్య గారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు. ఈ సినిమా కోసం చాలా రీసర్చ్ చేశామని.. నటీనటులు కూడా తమ ఉత్తమ ప్రదర్శన ఇచ్చారన్నారు. కాగా..ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు రాఘుపతి వెంకయ్య నాయుడు సినిమాను నిర్మిస్తున్నారు.

నరేష్ వికే, తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, అఖిల్ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్, చాణక్య, దేవ్ రాజ్ తదితరులు న‌టించిన ఈ చిత్రానికి రచన, దర్శకుడు: బాబ్జీ, నిర్మాత: మండవ సతీష్ బాబు, బ్యానర్: ఎల్లో లైన్ పిక్చర్స్ సంగీతం: శ్రీ వెంకట్, బ్యాగ్రౌండ్ స్కోర్: రాజ్, సినిమాటోగ్రఫీ: కిషన్ సాగర్, ఎడిటింగ్: మోహన్ రామారావు

Next Story