వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ట్విటర్ లో మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. రాక్షస పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలపై వైఎస్ జగన్ గారికి కక్ష దేనికో అర్ధం కావడంలేదన్నారు లోకేష్ . మహిళా అధికారిణిపై వైఎస్ఆర్ సీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేశారన్నారు.
ఈ మహిళా అధికారిపై దాడి చేయడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులుఅరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్ పై కూడా విడుదలయ్యారు.