ఇక ఆత్మహత్యలు ఉండకూడదు: నారా లోకేష్‌

By సుభాష్  Published on  4 March 2020 3:22 PM GMT
ఇక ఆత్మహత్యలు ఉండకూడదు: నారా లోకేష్‌

గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని టీడీపీ నేత నారా లోకేష్‌ దర్శించుకున్నారు. అనంతరం స్థానిక షరాఫ్‌ బజారులో లక్ష్మీనరసింహ గోల్డ్‌ స్మిత్‌ వెల్ఫేర్‌ సొసైటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌ ట్విట్‌ చేశారు. ఇకపై స్వర్ణకారుల ఆత్మహత్యలు ఉండవద్దనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. వారు తమ వృత్తిని కొనసాగించే విధంగా పని ప్రదేశాల్లో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. గోల్డ్‌ బిస్కెట్స్‌ లోన్స్‌, ఉచిత వైద్య సహాయం, బీమా, వారి పిల్లల చదువుకు సాయం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ సొసైటీద్వారా అందించనున్నట్లు లోకేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం సభ్యులు లోకేష్‌ను శాలువతో సత్కరించారు.Next Story
Share it