ప్రతిపక్ష నేతలపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 12:15 PM GMT
ప్రతిపక్ష నేతలపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

శ్రీకాకుళం : టీడీపీలో కొంత మంది సన్నాసి నేతలున్నారని.. అలాంటివారే తమ ప్రభుత్వ నాయకుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నీరు పేద విద్యార్థులకు మెరుగైనా విద్య తేవాలన్నా.. ప్రభుత్వ నిర్ణయాన్ని అలాంటి నాయకులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

మీ పిల్లలను కార్పొరేట్‌ ఇంగ్లీష్‌ మీడియం విద్యాసంస్థల్లో చదివించడం లేదా..? అని ప్రశ్నించారు. మరీ ఈ పేద విద్యార్థులను ఎందుకు ఎదగ నివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల విషయంలో మాత్రం నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.

బ్రీఫ్డ్ మీ చంద్రబాబు గండిపేటలో ఎన్టీఆర్ విద్యా సంస్థలు ఇంగ్లీషు మీడియం ది కాదా..? అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదా..? ఇలాంటి వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడతారా..?.. అంటూ ప్రతిపక్ష నేతలపై నాని ప్రశ్నలు సంధించారు.

Next Story
Share it