హైదరాబాద్ : కొత్త సినిమా ”నాని గాడు” చిత్రం విడుదల కాక ముందే యూట్యూబ్ లో లీక్ చేశారంటూ ఆ చిత్రం హీరో దుర్గా ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబ్ లింక్ ను తొలగించి న్యాయం చేయకపోతే బుధవారం ఫిలింఛాంబర్ ఎదుట చిత్ర యూనిట్ మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించాడు. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే విడుదలకు ముందే యూట్యూబ్ లో సినిమా పెట్టడంపై అతను మండిపడ్డాడు. సినిమా విడుదల చేసేందుకు సెన్సార్ బోర్డు U సర్టిఫికేట్ కూడా ఇచ్చిందని, త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సమయంలో ఇలా చేశారని వాపోయారు. వెంటనే ఆ లింక్ ను తొలగించి తమకు న్యాయం చేయకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.