బాల‌య్య‌ 'రూల‌ర్‌' అప్ డేట్ ఏంటి..?

By Newsmeter.Network  Published on  29 Nov 2019 7:29 AM GMT
బాల‌య్య‌ రూల‌ర్‌ అప్ డేట్ ఏంటి..?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'రూల‌ర్‌'. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌మోష‌న్ల‌ను కూడా భారీగా చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాట‌ల లిరిక‌ల్ వీడియోల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు శ‌క్తిమంత‌మైన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. జై సింహా వంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌ర్వాత బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం కావ‌డంతో రూల‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన బాల‌కృష్ణ లుక్స్, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్‌రాజ్‌, భూమిక‌, జ‌య‌సుధ‌, షాయాజీ షిండే, ధ‌న్‌రాజ్‌, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌రి.. రూల‌ర్ గా బాల‌య్య ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Next Story
Share it