నమస్కారం మన సంస్కారం.. !

By అంజి  Published on  6 Feb 2020 2:47 AM GMT
నమస్కారం మన సంస్కారం.. !

నమస్కారం చేస్తుంటే.. అరే నమస్కారం ఏందిరా మనమేమైనా పాతకాలం వాళ్లమా.. హ్యాండ్ షేక్ ఇవ్వు.. అని అంటూ ఉంటారు. ఈ హ్యాండ్ షేక్ సంప్రదాయం అన్నది ఎంతో ప్రమాదకరమైనది. సనాతన సంప్రదాయం అయిన నమస్కారం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంతో శ్రేయస్కరమైనది కూడానూ.. !

ప్రస్తుతం ప్రపంచం మొత్తం వైరస్ లతో నిండిపోయింది. ఎక్కడ చూసినా మనుషులకు హాని చేసే బాక్టీరియానే.. కరోనా వైరస్ లాంటివి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతున్న తరుణంలో పాశ్చాత్య పోకడల కంటే మన 'నమస్తే' సంప్రదాయం ఎంతో గొప్పది..ఉన్నతమైనది కూడానూ..! ఎలాగా అని మీకు డౌట్ కదూ.. ఒక్కసారి హ్యాండ్ షేక్ ఇచ్చారు అనుకోండి 124 మిలియన్ల బాక్టీరియల్ కాలనీ ఒకరి నుండి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అవతలి వ్యక్తి అంతకు ముందు ఏమి చేశాడో.. ఏమో మనకు తెలియదు.. అతని చేతుల్లోని బాక్టీరియా మొత్తం మన చేతుల్లోకి వచ్చేస్తాయి. ఇక లేటెస్ట్ ట్రెండ్ అయిన హై-ఫై కూడా ప్రమాదకరమే..దీని ద్వారా 55 మిలియన్ల బాక్టీరియల్ కాలనీ ఒకరి చేతి నుండి మరొకరి చేతుల్లోకి వచ్చేస్తాయి.

ఫస్ట్ బంప్ లాంటిది కూడా 7 మిలియన్ల బాక్టీరియల్ కాలనీకి ఆశ్రయమిస్తుంది.ఇలాంటి వాటి వలన అంటు రోగాలు అతి త్వరగా వ్యాప్తి చెందుతాయి. అదే భారత సంప్రదాయం అయిన నమస్తే-నమస్కారం వంటి వాటిని పాటిస్తే బాక్టీరియా అన్నది ఒకరి చేతుల్లో నుండి మరొకరి చేతుల్లోకి వచ్చే అవకాశం అన్నది సున్నా అని చెప్పొచ్చు.124000000 బాక్టీరియల్ కాలనీ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందడం కంటే నమస్తే ద్వారా ఆ సంఖ్యను సున్నాకు తీసుకొని రావడం చాలా మంచిదే..అందరూ ఇలాంటి పద్ధతి, సంప్రదాయాలను కొనసాగిస్తే ఎన్నో వైరస్, బాక్టీరియాల నుండి కాస్తయినా జాగ్రత్త పడినట్లే..!

Next Story