నల్గొండ జిల్లా : నాగార్జున సాగర్ కు శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో వస్తుంది. రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు ఇన్‌ ప్లో 66వేల 984 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 66, 984 క్యూసెక్కులు ఉంది.  పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి సామార్ధ్యం 312 టీఎంసీలు కాగా..ఇప్పుడు డ్యాంలో 312 టీఎంసీలున్నాయి. నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తుంది. దీంతో..నాగార్జన సాగర్‌ వద్ద పర్యాటకుల సందడి కూడా బాగుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.