నాగార్జున రెడ్డి టీడీపీ ఏజెంట్..!- వైఎస్ఆర్ సీపీ నేత ఆమంచి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 10:27 AM GMT
నాగార్జున రెడ్డి టీడీపీ ఏజెంట్..!- వైఎస్ఆర్ సీపీ నేత ఆమంచి

తాడేపల్లి: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్‌ఆర్‌ సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్. నాగార్జున రెడ్డి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ కాదు..ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్‌గా పని చేశాడని ఆమంచి చెప్పారు. ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు అత్యంత సన్నిహితుడిగా నాగార్జున రెడ్డి ఉన్నాడని తెలిపారు. టీడీపీలో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నాడని చెప్పారు. కౌంటింగ్‌ ఏజెంట్‌గా నాగార్జున రెడ్డి కూర్చునప్పటికీ..చంద్రబాబు తమ పార్టీ మనిషి అని చెప్పుకోలేక పోతున్నాడన్నారు. కారణం.. నాగార్జున రెడ్డిపై 17 కేసులు ఉన్నాయని చెప్పారు. భార్యను వేధించడం, రేప్‌ కేసులు చంద్రబాబు హయాంలో నమోదయ్యాయని తెలిపారు. ఓ మహిళా అధికారిపై నాగార్జున రెడ్డి రాసిన భాషను చూస్తే..ఆయనను ఎవరైనా జర్నలిస్ట్ అంటారా అంటూ ప్రశ్నించారు. ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణి గురించి నాగార్జున రెడ్డి 'అంగపూజ' అనే భాష ఉపయోగించడం కరక్టా అని ఆమంచి జర్నలిస్ట్‌లను ప్రశ్నించారు.

నాగార్జునరెడ్డిపై దాడి కేసులో 12 గంటలలోనే ఆరుగురుని అరెస్ట్‌ చేశారని ఆమంచి చెప్పారు. .వెహికల్‌ ను కూడా సీజ్‌ చేశారన్నారు. అదే చంద్రబాబు హయాంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు వర్గీయుల శంకరయ్య అనే ఆంధ్రప్రభ రిపోర్టర్‌ ను చంపితే ఇంతవరకు అరెస్ట్‌ చేయలేదన్నారు. నాగార్జునరెడ్డిపై దాడిని తాము కూడా ఖండిస్తున్నట్లు

ఆమంచి చెప్పారు. దాడులను తాము ప్రోత్సహించమన్నారు. గత మూడు రోజులుగా నాగార్జున రెడ్డికి ఎవరూ కూడా మద్దతు తెలియజేయడంలేదన్నారు. చంద్రబాబు రాజకీయంగా చనిపోయాడనే ఆనందంలో ప్రజలున్నారని ఆమంచి చెప్పారు. చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతిలేదన్నారు. ఇక..అక్రమ కట్టడంలో ఉంటూ 'రివర్స్ కన్సర్వేటివ్ యాక్ట్' గురించి బాబూ మీకు తెలియదా అంటూ ఆమంచి నిలదీశారు.

Next Story
Share it