నాగబాబు మరో సంచలన ట్వీట్‌

By సుభాష్  Published on  23 May 2020 12:10 PM IST
నాగబాబు మరో సంచలన ట్వీట్‌

నాగబాబు సోషల్‌ మీడియా వేదికగా మరో సంచలన ట్వీట్‌ చేశారు. ఇటీవల గాడ్సేపై వివాదస్పద వ్యాఖ్యలుచేస్తూ పోస్టు చేసిన నాగబాబు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇండియన్‌ కరెన్సీ నోట్లపై మహాత్మగాంధీతో పాటు మరికొందరు మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉందని తెలిపారు.

'కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వాతంత్ర్య భారత

ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ.' అంటూ ట్వీట్‌ చేశారు.

అలాగే 'గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప ముఖాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు

కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.' అంటూ నాగబాబు తెలుగులో ట్వీట్‌ చేశారు.



Next Story