సమంత కోసం కేక్ ప్రిపేర్ చేసిన చైతూ
By రాణి Published on 28 April 2020 11:44 AM ISTలేడీ సూపర్ స్టార్ సమంత అక్కినేని 33వ పుట్టినరోజు. సామ్ ను చూసిన వారెవరైనా సరే ఆమెకు 33 సంవత్సరాలుంటాయని అస్సలనుకోరు కదా. సాధారణ రోజుల్లో అయితే సమంత తన పుట్టినరోజు నాడు అనాధ శరణాలయం, ఓల్డేజ్ హోమ్ వంటి వాటిల్లో సమయం గడిపేవారు. కానీ ఈ పుట్టినరోజుకి ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఫ్రెండ్స్ కి పార్టీలిచ్చే అవకాశమూ లేదు. ఇక చైతూ అయితే సమంత బర్త్ డే కి ఏం గిఫ్ట్ కొనివ్వలేని పరిస్థితి. అందుకే భార్య పుట్టిన రోజుకు తానే స్వయంగా కేక్ తయారు చేసిచ్చారు. అలా చైతూ సమంత కోసం కేక్ తయారు చేస్తున్న మేకింగ్ వీడియోను సామ్ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేక్ మేకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read : రికార్డ్ స్థాయిలో భారీగా పెరిగిన బంగారం ధర
మరోవైపు సామ్ ఫ్యాన్స్ ఈ మహానటి బర్త్ డే ను ట్విట్టర్, హలో, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు. హ్యాపీ బర్త్ డే లేడీ సూపర్ స్టార్, సమంత బర్త్ డే సీడీపీ హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ అవుతోంది. ఇక సమంత భర్త తన కోసం తయారు చేసిన కేక్ ను చాలా ఆనందంగా కట్ చేశారు. నా ఆనందానికి అవధుల్లేవంటూ దేవుణ్ణి ప్రార్థించారు.
Also Read : స్కూల్స్ ఓపెన్ అయ్యాయి.. పిల్లలను ఎలా కూర్చో పెడుతున్నారంటే..!
ఏమాయ చేశావె తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత బృందావనం, దూకుడు, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, జబర్దస్త్, రాయ్యా వస్తావయ్యా, ఆటో నగర్ సూర్య, అల్లుడు శీను, ఈగ, మనం, దూకుడు, అత్తారింటికి దారేది, రభస, జనతా గ్యారేజ్, సీమరాజా, 24, సన్నాఫ్ సత్యమూర్తి, కత్తి, అఆ, మహానటి, యూ టర్న్, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ సినిమాల్లో తనలోని నటనా ప్రతిభను ప్రేక్షకులకు చూపించింది. ఇటీవలే విడుదలైన జాను సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు సమంత. ప్రస్తుతం మరోసారి నాగచైతన్య కు జంటగా సినిమాలో కనిపించనుంది.