ఏడేళ్ల పాటు జబర్దస్త్ షో కి న్యాయ నిర్ణేతగా వహించాడు మెగా బ్రదర్, నవ్వుల నవాబు నాగబాబు. ఆ షో లో ఉన్నపుడు ఆయనకు ఎలాంటి టెన్షన్స్ లేవు. జీవితం సరదాగా..సాఫీగా సాగిపోయింది. రెండు నెలల క్రితం జబర్దస్త్ షో నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత వేరే ఛానల్ లో ప్రసారమయ్యే అదిరింది షో కి జడ్జిగా ప్రత్యక్షమయ్యారు. ఈ షో ఇప్పటికీ నాలుగు వారాలు పూర్తి చేసుకుంది కానీ…జబర్దస్త్ కు ఉన్నంత క్రేజ్ మాత్రం సంపాదించుకోలేక పోయింది. జబర్దస్త్ కమెడియన్సే ఈ షో లో తమ బెస్ట్ స్కిట్లను ఫెర్ఫామ్ చేయడమే ఇందుకు ప్రధాన కారణమేమో అనిపిస్తోంది. జబర్దస్త్ ను నాగబాబు వదిలేసినా…షో టీఆర్పీ అంత బాగా ఏం పడిపోలేదు. ఆయన ఉన్నప్పుడు..ఇప్పుడు పెద్ద తేడా ఏం లేదనిపిస్తోంది.

‘అదిరింది’ షో మంచి రేటింగ్ సంపాదించుకోలేకపోవడంతో…దానికి బాధ్యత వహిస్తూ నాగబాబు షో నుంచి తప్పుకోనున్నారని టాక్. అక్కడి నుంచి తప్పుకుంటే..మన నవ్వుల నవాబు తిరిగి జబర్దస్త్ లోకి వస్తారని సమాచారం. నిజంగానే నాగబాబు మళ్లీ జబర్దస్త్ కి రావడంతో.. షో టీఆర్పీ పెరగడం సంగతి అటుంచితే…బాబుని నమ్ముకుని అదిరింది షో కి వెళ్లిన జబర్దస్త్ కమెడియన్లు కోలుకోవడం కష్టమే.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.