భ‌క్తుల‌కు బంప‌ర్ ఆప‌ర్.. ఆగుడిలో ప్ర‌సాదం బిర్యానీ అట‌..

By Newsmeter.Network  Published on  26 Jan 2020 1:17 PM GMT
భ‌క్తుల‌కు బంప‌ర్ ఆప‌ర్.. ఆగుడిలో ప్ర‌సాదం బిర్యానీ అట‌..

కొన్ని టెంపుల్లో దేవుడు ఎంత ఫేమ‌స్సో.. అక్క‌డ ప్ర‌సాదం కూడా అంతే ఫేమ‌స్‌. తిరుప‌తి ల‌డ్డూ, అన్న‌వ‌రం ప్ర‌సాదం, షిరిడీ పాల‌కోవా ఆ కోవ‌కే చెందుతాయి. మ‌రీ టెంపుల్లో మాంసాహారాన్ని ప్ర‌సాదంగా పెడుతారా.. ? అది కూడా బిర్యానీని.

తమిళనాడులోని మదురైలో మునియాండి స్వామి ఆల‌యం ఉంది. ఇక్క‌డ ప్ర‌సాదంగా చికెన్‌బిర్యానీ, మటన్‌ బిర్యానీ పంపిణీ చేయ‌డం ఆచారం. ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 24 నుంచి 26 వ‌ర‌కు వార్షిక ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఈ ఉత్స‌వాల్లో పాల్గొనే భ‌క్తుల‌కు బిర్యానీని ప్ర‌సాదంగా అందిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది వెయ్యి కేజీల బియ్యం, 150 మేకలు, 300 కోళ్లను ఉపయోగించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఏమాత్రం వివక్ష చూపకుండా ఈ బిర్యానీ ప్రసాదాన్ని అందజేస్తారు.Mutton Biryani Served as Prasadam

ఇక్క‌డ ఇంకొ స‌దుపాయం కూడా ఉందంటోయ్.. ఆ బిర్యానీని పార్శ‌ల్ తీసుకొని కూడా వెళ్లొచ్చు. ఈ బిర్యాని ప్రసాదం కోసం భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సైతం అందజేస్తుంటారు. ఇక ఈ సాంప్ర‌దాయం దాదాపు 84 ఏళ్లుగా కొన‌సాగుతుంద‌ని అక్క‌డి వారు చెబుతున్నారు.

Next Story