ఆయన పుట్టిన రోజు పిల్లలకు పండగ రోజు

Children's Day I ఆయన పుట్టిన రోజు పిల్లలకు పండగ రోజు

By సుభాష్
Published on : 14 Nov 2020 8:34 AM IST

ఆయన పుట్టిన రోజు పిల్లలకు పండగ రోజు

భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం బాలల దినోత్సవంగా దేశమంతటా జరుపుతారు. జవహర్ లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న అలహాబాద్ లో జన్మించారు. వీరి తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ అధ్యక్షుడు. జవహర్ లాల్ నెహ్రూ లండన్ లో బారిస్టర్ పట్టా పొంది, 1912లో అలహాబాద్ న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1916 నుంచి కాంగ్రెస్ రాజకీయాలలో పాల్గొనడం ప్రారంభించి, 1929, 1936,1937,1951,1954లలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. గాంధీకి అభిమాన నాయకులైన నెహ్రూ స్వతంత్ర భారత ప్రధానిగా 1947 ఆగస్టు 15న బాధ్యతలు చేపట్టి 1967మే 27న మరణించారు. ఆయన మరణించే వరకు పదవిలో కొనసాగారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలోకి నడిపారు. అలీనోద్యమ నిర్మాతగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. వీరి కుమార్తె ఇందిరాగాంధీ, మనుమడు రాజీవ్ గాంధీ దేశ ప్రధానులుగా పదవులు చేపట్టారు.గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరి (1934), జీవిత చరిత్ర (1936), ది డిస్కవరి ఆఫ్ ఇండియా (1946) గ్రంథాలు వీరి మేధాశక్తికి నిదర్శనాలు. పిల్లలచే చాచా నెహ్రూగా అభిమానించబడిన నెహ్రూ పుట్టిన రోజున దేశమంతటా బాలల దినత్సవం ఘనంగా జరుగుతుంది.



పండిట్ నెహ్రూ.. 17 ఏళ్ల పాటు ప్రధానిగా సేవలందించారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీకి కుడిభుజం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. స్వాతంత్రానికి ముందు, తర్వాత భారత రాజకీయాల్లో ముఖ్య నేత. అలహాబాద్ హైకోర్టులో లాయర్ గానూ పనిచేశారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో బారిష్టర్ చదివిన పండిట్ నెహ్రూకి చిన్నపిల్లలంటే అమితమైన ప్రేమ. ఆయన జయంతి అయిన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. పండిట్ నాయకత్వంలో కాంగ్రెస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. 1962 ఇండో-చైనా యుద్దం నెహ్రూ నాయకత్వంలో అతిపెద్ద ఫెయిల్యూర్. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథం రాశారు. ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని నెహ్రూని కీర్తిస్తారు. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ, మనవడు రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రులుగా పనిచేశారు.

Next Story