మీ ఆధార్‌ కార్డులో ఏవైనా తప్పులున్నాయా..? మీ ఆధార్‌ కార్డుకు సంబంధించిన ఏవైనా సందేహాలు, కార్డులో తప్పులున్నాయా..? అయితే ఇలాంటి పనులకు ఆధార్‌ సెంటర్లకు వెళ్లకుండానే మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీరు ఆధార్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్‌ ఇండియా యూఐడీఏఐ ఆధార్ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 1947 లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆధార్‌ కార్డుదారులు తమ సమస్యలపై ఈ నెంబర్‌కు కాల్ చేయవచ్చు. యూఐడీఏఐ ప్రతినిధులతో మాట్లాడవచ్చు. మీ ఆధార్ నెంబర్ చెప్పి మీ సమస్యను వివరించవచ్చు. మీ సందేహాలకు వారు సమాధాలను, సమస్యలకు పరిష్కారాలను వివరిస్తారు. ఆ తర్వాత మీరు ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు. 1947 నెంబర్‌కు ఉచితంగా కాల్ చేయవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు.

కాగా, రోజూ లక్షన్నరకు కాల్స్‌ స్వీకరించే సామర్థ్యం ఈ యూఐడీఏఐ కాల్‌ సెంటర్ కు ఉంది. ఆధార్‌ కార్డుదారులు తమ రిజిస్టర్‌ మొబైల్ నంబర్‌ నుంచి యూఐడీఏఐ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాల్ చేయవచ్చు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకకు కాల్‌ సెంటర్‌ పని చేస్తుంది.

సుభాష్

.

Next Story