మేయ‌ర్లు, చైర్ ప‌ర్స‌న్ల ఎన్నిక ఆరోజే..

By Newsmeter.Network  Published on  23 Jan 2020 10:43 AM GMT
మేయ‌ర్లు, చైర్ ప‌ర్స‌న్ల ఎన్నిక ఆరోజే..

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని 9 కార్పొరేష‌న్లు, 120 మున్సిపాలిటీల‌కు బుధ‌వారం ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. జ‌నవ‌రి 25న మున్సిపల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. మున్సిపల్‌ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు 27వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

అనంతరం కొత్త పాలకమండలి తొలి సమావేశం నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ సమావేశంలోనే మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జ‌ర‌నుంద‌ని తెలిపింది. నగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్ ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి ఈ నెల 25న‌ నోటీసు ఇస్తామని అధికారులు వెల్లడించారు.

Next Story
Share it