రోజులు గడిచే కొద్దీ మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయి. తోడబుట్టిన అన్న, వరుసకు మేనమామ, తాత, తండ్రి, బాబాయ్ ఇలా బంధాల గురించి ఆలోచించకుండా…తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు కామాంధులు. ముంబైలో మైనర్ అయిన మేనకోడలిని గర్భవతిని చేసిన మేనమామకు ముంబై ప్రత్యేక కోర్టు 12 ఏళ్ళ కఠిన కారాగాల శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే…ముంబై కి చెందిన 13 ఏళ్ల మైనర్ బాలికపై వరుసకు మేమమామ(27) పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. కూతురిలో మార్పులు వస్తుండటం గమనించిన తల్లి అసలు విషయమేమిటో చెప్పాల్సిందిగా ఆరా తీయడంతో అసలు విషయం బయటికొచ్చింది.

మొదట కోపంతో అతడిపై కేసు పెట్టినా..తర్వాత బాధితురాలితో సహా తల్లి కూడా కేసును వాపస్ తీసుకుంది. అప్పటికే ముంబై పోలీసులు, వైద్యులు కోర్టుకు సాక్ష్యాధారాలను అందించడంతో…న్యాయస్థానం నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ జడ్జి ఏడీ డియో తీర్పు వెలువరించారు. కాగా..నిందితుడు రెండున్నర నెలలుగా బాధితురాలు, తల్లితోనే కలిసి ఉంటున్నాడని, ఈ క్రమంలోనే బాలికపై పలమార్లు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.