టీవీ, ఫోన్‌ ఒకేసారి చూస్తూ ఆపరేటింగ్‌ చేస్తుంటే మతిమరుపు వస్తుందా..?

By సుభాష్  Published on  7 Nov 2020 3:32 PM IST
టీవీ, ఫోన్‌ ఒకేసారి చూస్తూ ఆపరేటింగ్‌ చేస్తుంటే మతిమరుపు వస్తుందా..?

ఒక చేతిలో ఫోన్‌ పట్టుకుని, మరో చేతిలో టీవీ రిమోట్‌ పట్టుకుని టీవీ ముందు కూర్చున్నారా..? అయితే ప్రమాదం పొంచివుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒకేసారి పలు రకాల డిజిటల్‌ మాధ్యమాలు ఉపయోగించడం వల్ల మతి మరుపు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇలా రెండు పనులు ఒకేసారి చేయడం వల్ల ఏదో ఒక పని మీద మన ఏకాగ్రత పెట్టగల్గుతామని, అంతేకాకుండా భవిష్యత్తులో మనలో ఏకాగ్రత శక్తి అనేది నశించి చివరికి జ్ఞాపక శక్తి దెబ్బతింటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

కార్టిసాల్‌ అనే ఒత్తిడి హార్మోన్‌లో వచ్చే మర్పుల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందట. అలాగే సోషల్‌ మీడియా చూస్తుండటం, అదే సమయంలో కొందరు టీవీ చూడటం చేస్తుంటారు. ఒక వైపు ట్యాబ్‌ లేదా ఫోన్‌, టీవీలో సినిమాలు చేస్తుంటారు. ఇలాంటి వారిలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఒకే సమయంలో పలు రకాల బ్రౌజర్లు ఓపెన్‌ చేసినా అనేక సమస్యలకు దారి తీస్తుందని ఓ అధ్యయనంలో తేల్చారు వైద్య నిపుణులు.

ఇలా ఒకే సమయంలో రకరకాల ట్యాబ్‌లు ఓపెన్‌ చేసి చూడటం, మరో వైపు టీవీ చూడటం లాంటివి చేస్తే జ్ఞాపక శక్తి దెబ్బతీసే అవకాశం ఉందని అధ్యయనంలో తేలినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మల్టి డిజిటల్‌ మీడియాలో వినియోగించే వ్యక్తులు ఏకాగ్రత కోల్పోతున్నారని గుర్తించామన్నారు. తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నారని తేల్చారు. ఈ పరిశోధన బృందం 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయసు గల 80 మందిపై అధ్యయనం నిర్వహించింది. అయితే ఇందులో పాల్గొన్నవారిని వరుసగా ఫోటోలతో కూడిన స్క్రీన్‌ను చూడమని సూచించారు. వారికి ఆ ఫోటోలు ఎంత నచ్చాయో రేటింగ్‌ ఇవ్వమన్నారు. ఆ తర్వాత పది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుమని చెప్పి, ఆ పైవారికి మరిన్ని ఫోటోలు చూపించారు. ఆ తర్వాత మళ్లీ కొన్ని ఫోటోలను చూపించి వీటిని ఇంతకు ముందు చూశారా అని అడిగారు. చూసిన ఫోటోలను గుర్తుకు తెచ్చుకునే ముందు వారిలో శ్రద్ద కోల్పోవడం వంటి లోపాలను నిపుణులు గుర్తించారు.

ఒక ప్రశ్నపత్రం ఇచ్చి అందులో రోజువాళ్లు ఎంత సేపు టీవీ, ఫోన్‌ చూస్తున్నారో లెక్కించమని అడిగారు. మీడియా మల్టీ టాస్కింగ్‌ చేయని వారికంటే చేసేవాళ్లే ఎక్కువ జ్ఞాపక శక్తి కోల్పోతారని గుర్తించారు. ఈ విధంగా మతిమరుపు వచ్చే అవకాశాలున్నాయని గుర్తించారు. మరిన్ని అధ్యనాలు నిర్వహిస్తే మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Next Story