భారత్ లో అత్యంత సంపన్న వ్యక్తిగా ముకేశ్ అంబానీ వరుసగా ఎనిమిదో సారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2019 సంవత్సరానికి భారత్ లోని శ్రీమంతుల జాబితాలో ఆయన ముందు నిలిచారు.

దేశంలోని అంత్యంత ధనవంతులకు సంబంధించి 100 మందితో కూడిన జాబితాను 'ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హూరన్'. విడుదల చేసింది. ఈ జాబితాలో రూ. 3,80,700 కోట్ల‌తో వరుసగా ఎనిమిదోసారి ముకేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. లండన్ కు చెందిన ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ రూ.1.86 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలవగా..విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ, లక్ష్మీమిట్టల్ రూ.1.17 లక్షల కోట్లు, రూ.1.07 లక్షల కోట్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నలుగురు తెలుగు వారికి చోటు దక్కింది. వారిలో రూ.13,400 కోట్లతో 'మేఘా' చైర్మన్‌ పీపీరెడ్డి 57వ స్థానంలో నిలిచారు. రూ.12,900 కోట్లతో 63వ స్థానంలో 'మేఘా' ఎండీ పీవీకే రెడ్డి ఉన్నారు. ఇక 83వ స్థానంలో దివీస్‌ కిరణ్‌, 89వ స్థానంలో దివీస్‌ నీలిమ ఉన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story