బాబూ కోడెలను అవమానించింది నిజం కాదా?..లేఖలో ముద్రగడ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 12:39 PM GMT
బాబూ కోడెలను అవమానించింది నిజం కాదా?..లేఖలో ముద్రగడ

  • చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేఖ
  • కోడెలకు వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా?
  • మీ కుమారుడు వజ్రమా అని కోడెల ఆడగలేదా బాబూ?!
  • పుష్కరాల ఫుటేజీని పోలీసుల చేతే బాబు మాయం చేయించాడు
  • చంద్రబాబుది రాక్షస పాలన

కిర్లంపూడి, తూ.గో.జిల్లా: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి తనదైన శైలిలో పంచ్‌లు పేల్చారు. కోడెల అంతిమ యాత్రలో చంద్రబాబు బాగానే నటించారు..ఒక వ్యక్తి మీద నిజంగా ప్రేమ ఉంటే..నమష్కరించాలని, మౌనంగా ఉండాలి కాని..విక్టరీ సింబల్ చూపించడం ఏ సంస్కారమని ముద్రగడ ప్రశ్నించారు. ఈ నటనంతా రాజకీయ లబ్ది కోసమేనన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ముద్రగడ ఓ లేఖ రాశారు. అధికారం కోల్పోయిన తరువాత ముద్రగడ చిలుక పలుకులు పలుకుతున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కోడెలను చంద్రబాబు తన దగ్గరకు పిలిపించుకున్నారని..మీ కుమారుడి వలన చెడ్డ పేరు వస్తుందని చెప్పారని..అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చారని..అందుకు కోడెల మీ పుత్రరత్నం వజ్రమా అని చంద్రబాబును ప్రశ్నించడం జరిగిందన్నారు. ఇది నిజం కాదా బాబూ అని ముద్రగడ లేఖలో చంద్రబాబును ప్రశ్నించారు. పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం అయిందని చంద్రబాబు బాధ పడుతున్నారని..దానికి ఆజ్యం పోషింది చంద్రబాబు కాదా అని లేఖలో ముద్రగడ ప్రశ్నించారు.

ఆ పాపం బాబుదే..!

గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 30 మందిని బలి తీసుకున్నారని లేఖలో ముద్రగడ ఆరోపించారు. తనపై కేసులు పెట్టడానికి వీలు లేకుండా ఏకంగా పోలీసుల చేతే సీసీటీవీ ఫుటేజ్‌ మాయం చేయించిన ఘనత చంద్రబాబుదే అంటూ మండిపడ్డారు. కాపులు కోర్టులు చుట్టూ తిరగడానికి బాబే కారణమన్నారు. ప్రజలకు రాక్షస పాలన చూపించిన బాబు నేడు ప్రజల కోసమే బతుకున్నాను అంటూ దొంగ మాటలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంకా ఎంత కాలం బట్టలు తడిచిపోయేలా కన్నీరు కారుస్తూ నటిస్తారని చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు.

Next Story
Share it