ప్లేఆఫ్స్ నుంచి చెన్నై నిష్క్రమణ.. ఇదొక ఆటే అంటూ.. ధోని భార్య భావోద్వేగం
By సుభాష్ Published on 26 Oct 2020 7:37 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇప్పటి వరకు ప్రతి సీజన్‌లో ప్లే ఆఫ్ చేరిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే.. ఈ సీజన్‌లో ఆ జట్టు దారుణ పరాభవాలను చవిచూస్తోంది. మూడు సార్లు టైటిల్ గెలిచిన ఆ జట్టు.. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ప్లే ఆప్స్ చేరుకునే అవకాశం కోల్పోయింది. ఆదివారం సాయంత్రం చెన్నై జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుత విజయం సాధించినా.. ముంబై ఇండియన్స్‌ను రాజస్థాన్ రాయల్స్ ఓడించడడంతో చెన్నై కథ ముగిసింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ధోని సేన నాలుగు విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్లతో.. ఆఖరి స్థానంలో నిలిచింది. మిగతా రెండు మ్యాచులు గెలిచినా.. చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు మూసుకుపోయాయి.
ఈ విషయం ఇదివరకే స్పష్టమైనా ఆదివారం వరకూ మిగతా జట్ల ఫలితాల ఆధారంగా ధోనీసేనకు గణంకాల పరంగా చివరి అవకాశం ఉండేది. అయితే ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ గెలవడంతో చెన్నై అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిలిచింది.
ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.
ఇదిలా ఉంటే.. ధోని భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగపు పోస్టు చేసింది.
కొన్ని గెలుస్తాం.. కొన్ని ఓడిపోతాం.. ఇదొక ఆట మాత్రమే
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన చోటే మరికొన్ని దారుణ వైఫల్యాలు చవిచూశాం.
అందులో ఎన్నో ఏళ్లు గడిచిపోయినా.. గెలిచినప్పుడు సంతోషించాం, ఓడినప్పుడు బాధపడ్డాం.
కొన్ని గెలుపొందాం.. మరికొన్ని ఓడిపోయాం.. ఇంకొన్ని వదులుకున్నాం.. ఇదొక ఆట మాత్రమే
ఎన్నో విమర్శలు, మరెన్నో అవమానాలు..
కానీ, ఓ క్రీడాకారుడిగా ఈ భావోద్వేగాలు నీ స్పూర్తిని అధిగమించేలా చేయకు.. ఇదో ఆట మాత్రమే
ఓడిపోవాలని ఎవరూ అనుకోరు.. అలా అని అందరూ గెలవలేరూ..
ఆటలో ఆగిపోయినప్పుడు మైదానాన్ని వీడడం భారంగా ఉంటుంది. ఇదొక ఆట మాత్రమే
మీరు అప్పుడూ విజేతలే.. ఇప్పుడూ విజేతలే..
నిజమైన యోధులు పోరాడటానికే పుడతారు.. మా మదిలో, హృదయాల్లో ఎప్పటికీ నిలిచే సూపర్ కింగ్స్‌లా..
అంటూ.. సాక్షి ధోని బావోద్వేగపు పోస్టును చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Oct 25, 2020 at 10:12am PDT