ధోని వచ్చేస్తున్నాడు.. !

By Newsmeter.Network  Published on  25 Feb 2020 4:03 PM GMT
ధోని వచ్చేస్తున్నాడు.. !

చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులకు శుభవార్త ఇది. ఆ జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోని.. క్రికెట్‌ సాధన మొదలు పెట్టనున్నాడు. మార్చి 2 నుంచి చిదంబరం స్టేడియంలో క్రికెట్ సాధన చేయనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం ధ్రువీకరించింది. సీనియర్‌ ప్లేయర్లు సురేశ్‌ రైనా, అంబటి రాయుడుతో కలిసి ప్రాక్టీస్‌ చేయనున్నాడు.

చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ.. మహేంద్రసింగ్‌ ధోని మార్చి2 నుంచి ఎంఏ చిదంబరం స్టేడియంలో శిక్షణ తీసుకుంటాడు. అప్పటికి అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో కలిసి సాధన చేస్తాడు. పూర్తిస్థాయి శిక్షణ శిబిరం 19 నుంచి మొదలవుతుంది. మొత్తం ఆటగాళ్లు అప్పుడు పాల్గొంటారని తెలిపాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మార్చి 29న ప్రారంభమవుతుండగా.. మొదటి మ్యాచ్‌లో చైన్నై సూపర్‌కింగ్స్, డిఫెడింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది జరిగిన ప్రపంచకప్‌ కప్‌ సైమీ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ధోని మైదానంలో కనిపించలేదు. కొద్ది రోజులు సైనికుడిగా విధులు నిర్తర్వించాడు. అనంతరం ప్రైవేటు కార్యక్రమాల్లో తళుక్కున మెరుస్తున్నాడు. ధోని రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కెప్టెన్‌ కోహ్లీ కొంత స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశాడు.

అయినప్పటికి ధోని రిటైర్‌మెంట్‌ పై ఊహాగానాలు ఆగలేదు. ఓ సందర్భంలో టీమిండియా కోచ్‌ రవిశాస్త్రికి ఓ ప్రశ్న ఎదురైంది. అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోని ఉంటాడా..? అని. ఐపీఎల్‌ ఫామ్‌ ఆధారంగానే ధోని వరల్డ్‌కప్‌ జట్టులో ఉంటాడో లేదో నిర్ణయిస్తామని రవిశాస్త్రి సమాధానమిచ్చాడు. ధోని సన్నిహితులు కూడా.. ఐపీఎల్‌లో ధోని రాణిస్తేనే అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉందని చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి ధోనిపై పడింది. ఐపీఎల్‌లో ధోని ఎలా ఆడతాడో నని అందరు ఎదురుచూస్తున్నారు.

Next Story
Share it