ధోని న్యూలుక్‌ అదుర్స్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sep 2020 8:49 AM GMT
ధోని న్యూలుక్‌ అదుర్స్‌

మైదానంలో మహేంద్రసింగ్‌ ధోని ఉన్నాడంటే చాలు అభిమానుల్లో ఎలాంటి ఆందోళన ఉండదు. ధోని ఉన్నాడుగా.. గెలిపిస్తావులే అని భరోసా. అది టీమ్‌ఇండియా అయినా కావచ్చు.. చెన్నై సూపర్‌కింగ్స్‌ అయినా కావచ్చు. రిటైర్‌మెంట్ అనంతరం ధోని తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. 39ఏళ్ల వయసులో కూడా వికెట్ల వెనకు చురుగ్గా కదులుతున్నాడు. హెలికాప్టర్‌​ షాట్‌ కొట్టినా.. జుట్టుపెంచినా.. జుట్టు కత్తిరించినా ఎంచేసినా అభిమానుల్లో అవి చర్చనీయాంశాలే. తాజాగా ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ధోని న్యూలుక్‌తో ఆకట్టుకున్నాడు. తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని బరిలోకి దిగాడు.

దక్షిణాది బాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సూర్య, 'సింగం' చిత్రాల్లో మాదిరిగా, ధోనీ తన స్టయిల్ ను మార్చుకున్నారు. ఇక, ఈ చిత్రాలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ధోని లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అరగ్రేటం చేసిన రోజుల్లో ధోని జులపాల జట్టుకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు సాధించింది. చేధనలో అంబటి రాయుడు (71; 48బంతుల్లో 6పోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో.. చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో చెన్నై..ముం బై పై చెన్నై 5 వికెట్ల తేడాతో గెలిచింది.

Next Story