'ఎమ్మార్పీఎస్ నేత' దారుణ హత్య
By Newsmeter.Network Published on 30 Nov 2019 7:23 PM IST
దేశంలో హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు హత్యకు గురవుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. ఎమ్మార్సీఎస్ నేత జగ్గు ప్రకాష్‌ను రమణను ఓ వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హతమర్చాడు. పట్టపగలే నడిరోడ్డుపై ఈ హత్య జరగడంతో స్థానికులు పరుగులు తీశారు. అతి దారుణంగా హత్య చేసిన అనంతరం కూడా ఏ మాత్రం భయం , టెన్షన్ లేకుండా పోలీసులు వచ్చే వరకూ శవం దగ్గరే కూర్చోవడం గమనార్హం. అతి కిరాతకంగా జరిగిన ఈ హత్య రాష్ట్రంలో సంచనలం సృష్టిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు ముందే నిందితుడు లొంగిపోయినట్లు సమాచారం.
మృతుడు జగ్గు ప్రకాష్‌ను కొద్దికాలం క్రితం రమణ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని.. అందుకే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.