మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?
By సుభాష్ Published on 8 Jun 2020 4:18 AM GMTఈ రోజు (జూన్ 8) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఈ రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి.. చల్లబరిచే మృగశిర మొదలవుతుంది.
మృగశిర కార్తె అంటే..
ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మీక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి. మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్న వారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
ఈ నేపథ్యంలో మనిషి శరీరంలో మార్పులు జరిగి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. గుండెజబ్బులు, ఆస్తమా తదితర ఆనారోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాల్సిందే. అసలు మృగశిర కార్తెకు ఉన్న సంబంధం ఏమిటీ..? చేపలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
వ్యాధుల నియంత్రణకు చేపలు
మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..? రోకండ్లను సైతం పగులగొట్టె ఎండలు తగ్గిపోతాయి. వర్షాలు మొదలవుతాయి. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్‌లోచాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే. పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు..ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తినేవారు. ఈ రోజు ఏ ఇంటా చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ప్రై చేసుకుని ఖచ్చితంగా తింటుంటారు.
చేపలలో పోషకాలు:
► చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి.
► చేపలు కొవ్వులు చాలా సులభంగాజీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.
► చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి.
► ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.
► చేపల్లో బీ12 విటమిన్, రైబోప్లవిన్, నియాసిన్, బయెటిక్, థయామిన్ తదితర విటమిన్లు లభిస్తాయి.
► సముద్ర చేపల కాలేయంలో విటమిన్‌ఏ,డీ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
► చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు, ఆస్తమా, షూగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల తల్లులకు ఎంతో మేలు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థ అభివృద్ధి చేస్తాయి చేపలు
► మన రాష్ట్ర చేపల్లో కొర్రమీనులో లభించే ఆరాఖిడోనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం ఉంటుంది
► దేశీయ మార్పు చేపల్లో ఐరన్, కాపర్ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
► ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున స్థానికంగా దొరికే పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతోకలిపి వండుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు
► మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.
► చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్న వారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.