” ఒక పక్క కరోనా విపత్తుతో కష్టాలను దిగమింగి, ఎంత అవసరమున్నా బయటికి రాకుండా కోట్లాది మంది ప్రజలు గడపలు దాటకుండా లాక్ డౌన్ పాటిస్తుంటే చంద్రబాబు సుపుత్రుడు మాలోకం మాత్రం లాక్ డౌన్ ను ఉల్లంఘించి యథేచ్ఛగా రోడ్లపై చక్కర్లు కొడుతూ మాతృభాషలో దేవాన్ష్ కు స్కేట్ బోర్డు నేర్పిస్తున్నాడు. హ్యాట్సాఫ్ ” అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు.

కరోనాను అడ్డం పెట్టుకుని సీఎం జగన్ పై దుమ్మెత్తి పోయడానికే చంద్రబాబుకు సమయం సరిపోదు. ఇక ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునేెంత తీరిక ఆయనకెక్కడిది ? అంటూ విమర్శించారు. పనిచేసే ప్రభుత్వంపై రాళ్లు విసరడం తప్ప అన్నార్తులకు సహాయం చేసే ఓపిక, ఆదుకోవాలన్న సహృదయం మీకు ఎలాగూ లేదు. కనీసం లాక్ డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొడుకు, మనవడు రోడ్లపైకి రాకుండా ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండంటూ సలహా ఇచ్చారు. కరోనాకు హోదా, స్థాయి, సంపద అన్న బేధాలేవీ తెలియదు. వీధుల్లో విహానికి వస్తే కరోనా కనికరించకుండా కాటేస్తుందంటూ జాగ్రత్తలు పాటించమని తెలిపారు.

Also Read : మహిళకు సెల్యూట్ చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్

 

Vijay Sai Reddy

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.