మహిళకు సెల్యూట్ చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్

By రాణి  Published on  18 April 2020 12:29 PM GMT
మహిళకు సెల్యూట్ చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్

  • మీ అమ్మతనం చూసి నేను చలించిపోయాను

మూడ్రోజుల క్రితం తుని లో ఓ మహిళ ఎండలో చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల కోసం ఓ మహిళ కూల్ డ్రింక్స్ బాటిళ్లను అందజేసేందుకు ముందుకొచ్చింది. కానీ పోలీసులు వాటిని స్వీకరించలేదు. ఆమెకొచ్చే జీతం నెలకు రూ. 3500. వాటిలోనే పోలీసులకు ఏదొక సాయం చేయాలని తలిచి వచ్చిన ఆ మాతృమూర్తికి డీజీపీ గౌతమ్ సవాంగ్ కృతజ్ఞతలు చెప్పారు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వగా వెంటనే ఆమె ఎవరో ఏంటో కనుక్కోమని సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఎట్టకేలకు మహిళ ఆచూకీ తెలుసుకుని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆమెతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

Also Read : సీఎం జగన్ పై నటి ట్వీట్..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

మీ అమ్మతనాన్ని చూసి మేం చలించిపోయాం. మీలాంటి వారి కోసమే మేమంతా పనిచేస్తున్నాం. మీకు రక్షణ కలిగించేందుకే మేం నిరంతరం డ్యూటీ చేస్తున్నాం. మీ ప్రేమకు ఫిదా అయ్యాం. మీకు మా సెల్యూట్ అమ్మా. మీకు వీలైతే రోజూ మీ ముఖం మాకొక సారి చూపించండి. మాకు ధైర్యంగా ఉంటుంది. అని డీజీపీ గౌతమ్ సవాంగ్ లోకమణి అనే మహిళకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : మహాతల్లివమ్మా..చాలా పెద్ద మనసు నీది



Next Story