ఏపీ డీజీపీ కి ఎంపీ విజయసాయి లేఖ

By రాణి  Published on  15 April 2020 12:50 PM GMT
ఏపీ డీజీపీ కి ఎంపీ విజయసాయి లేఖ

ఏపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీకి బుధవారం ఓ లేఖ రాశారు. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ చేయించాలని విజయసాయి ఆ లేఖ ద్వారా డీజీపీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖకు రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన లేఖలో ఉన్న డాక్యుమెంట్లు అబద్ధమని, అందులో ఉన్న సంతకాలు కూడా ఫోర్జరీ చేసినవేనని తాను నమ్ముతున్నానన్నారు. ఎందుకంటే రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు చేసిన సంతకానికి, ఇప్పుడు ఆ లేఖలో ఉన్న సంతకానికి చాలా తేడా ఉందన్నారు.

మహాతల్లివమ్మా..చాలా పెద్ద మనసు నీది

తమకొచ్చిన సమాచారం మేరకు ఆ లేఖ టీడీపీ కార్యాలయం నుంచి వెలువడిందని, టీడీపీ ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వంపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ నాటకానికి తెరలేపిందని విజయసాయి ఆరోపించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వర్ల రామయ్య, టీడీ జనార్థన్ లు కలిసి ఈ లేఖను సృష్టించగా..ఇదంతా రమేష్ కుమార్ కు తెలిసే జరిగిందన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని విజయసాయి డీజీపీ సవాంగ్ ను కోరారు. లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి, అది ఫోర్జరీ అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైరల్ : పిల్లాడికి బర్త్ డే విషెస్ చెప్పిన పోలీసులు..ఎందుకో మీరే చూడండి

Next Story