ఎమ్మెల్సీ నారా లోకేష్ పై ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు. ” పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్ ఆర్ సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే… నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు ప్రెస్ మీట్ లలో ఫ్రస్టేట్ అవుతున్నాడు.” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విజయసాయి చేసిన ట్వీట్ కు ఓ నెటిజన్ దానిని తిప్పికొట్టేలా రిప్లై ఇచ్చాడు. ”ఓ గుంట నక్క, ఈ క్రింద ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అఫిషియల్ ప్రెస్ రిలీజ్ చూడు. అందుకే కదా అనేది మిమ్మల్ని గన్నేరుపప్పు బ్యాచ్ అనేది.”

మరో నెటిజన్ అయితే ”మీరేమో పార్లమెంట్ సమావేశాలో సమర్ధిస్తారు…ఇక్కడ మన జగన్ రెడ్డి సర్ ఏమో మేము వ్యతిరేకం అంటారు. దానికి సమాధానం కావాలి మీ దగ్గర నుండి..మళ్ళీ మన గన్నేరు పప్పు దగ్గర నుండి” అని రిప్లై పెట్టారు.

మరి విజయసాయి రెడ్డి లోకేష్ పై కౌంటర్ వేస్తూ..చేసిన ట్వీట్ పై లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.