శుక్రవారం తెల్లవారుజామున అరకు ఎంపీ మాధవి పెళ్లి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 5:58 PM GMT
శుక్రవారం తెల్లవారుజామున అరకు ఎంపీ మాధవి పెళ్లి

విశాఖపట్నం: వైఎస్ఆర్ సీపీ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి శుక్రవారం తెల్లవారుజామున 3గంటల 15 నిమిషాలకు జరగనుంది. తన చిన్ననాటి మిత్రుడు కూసిరెడ్డి శివప్రసాద్‌ను ఎంపీ మాధవి పెళ్లి చేసుకోనున్నారు. మాధవి, శివప్రసాద్ తల్లిదండ్రులు మిత్రులు. చాలా కాలం నుంచి కూడా మాధవి, శివ ప్రసాద్ స్నేహితులుగా ఉన్నారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని ఎంపీ మాధవి గతంలో చెప్పారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరబన్నపాలెం గ్రామంలో మాదవి, శివప్రసాద్‌ల వివాహం శుక్రవారం తెల్లవారుజామున 3గంటల 15నిమిషాలకు జరగనుంది. మాదవి, శివప్రసాద్‌లది వేరేవేరే కులం అయినప్పటికీ పెద్దలు ఒప్పుకోవడంతో ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఇండియాలోనే అత్యంత పూర్ ఎంపీ మాధవి.

ఎన్నికలే ప్రేమను చిగురింపజేశాయి..!

గత ఎన్నికల్లో ఇద్దరూ కలిసి ప్రచారం చేశారు. అప్పటికే స్నేహితులుగా ఉన్న వీరి మధ్య ప్రేమ పండటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఎన్నికల సమయంలో ప్రసాద్ అన్ని తానై చూసుకున్నారు. దగ్గరుండి ఎన్నికల ప్రణాళికలు రచించారు. ఈ సమయంలోనే ఇద్దరు ఒకరు మనసు ఒకరు అర్థం చేసుకున్నారు. ప్రేమికులుగా మారారు. ఎన్నికలు తరువాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఒకరిమనసు ఒకరికి తెలుసు

చిన్నతనం నుంచి ఇద్దరం స్నేహితులం. కలిసి చదవడంతో ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. ఎన్నికల సమయంలో అన్నీ తానై చూసుకున్నారు. అప్పుడే శివప్రసాద్ నాకు భర్తగా వస్తే బాగుంటుందని అనుకున్నాను. - మాధవి, అరకు ఎంపీ

మాధవి భార్యగా రావడం నా అదృష్టం

ఇద్దరం కలిసి చదువుకున్నాం, స్నేహితులం. ఎన్నికల్లో అవసరమైన సాయం చేశాను. స్నేహంప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. - కుసిరెడ్డి శివప్రసాద్

Next Story
Share it