ఎంపీని అడ్డుకుని వినతిపత్రం ఇచ్చిన రైతులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 2:03 PM GMT
ఎంపీని అడ్డుకుని వినతిపత్రం ఇచ్చిన రైతులు..!

నరసరావుపేట: తమ గోడు వినండి అంటూ రైతులు ఎంపీని అడ్డుకున్నారు. అంతేకాదు..తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. రైతుల అనుమతులు, అంగీకారం లేకుండా తమ పొలాల్లోంచి హెచ్‌.పి.సి.ఎల్‌ పైప్‌ లైన్లు వేస్తున్నారంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పైప్ లైన్ వలన తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. చట్ట ప్రకారం రైతులకు హెచ్‌.పి.సి.ఎల్ కంపెనీ నుంచి నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీకి అన్నదాతలు వినతిపత్రం ఇచ్చారు.

Next Story
Share it