జార్జ్ రెడ్డి సమాధి దగ్గర చిత్ర యూనిట్ నివాళ్లు..!

By Newsmeter.Network  Published on  21 Nov 2019 7:31 AM GMT
జార్జ్  రెడ్డి సమాధి దగ్గర చిత్ర యూనిట్ నివాళ్లు..!

ముఖ్యాంశాలు

  • జార్జ్ రెడ్డి సమాధి దగ్గర నివాళ్లు అర్పించిన చిత్ర యూనిట్
  • రెండేళ్ల పాటు కష్టపడి సినిమా తీశామన్న చిత్ర యూనిట్
  • జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర నేటి యువతకు ఆదర్శం కావాలన్న దర్శకుడు జీవన్ రెడ్డి

హైదరాబాద్ : శుక్రవారం జార్జ్‌ రెడ్డి సినిమా విడుదల సందర్భంగా నారాయణగూడలోని ఆయన సమాధి దగ్గర చిత్ర యూనిట్ నివాళ్లు అర్పించింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. జార్జ్ రెడ్డి చరిత్రను స్పూర్తిగా తీసుకుని చిత్రాన్ని నిర్మించామన్నారు యూనిట్ సభ్యులు. ఈ సమాజం జార్జ్‌ రెడ్డి లాంటి వాళ్లను చాలా మందిని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. ఎలా కోల్పోయామో..ఎందుకు కోల్పోయామో తెలిపేందుకు ఈ సినిమా తీశామన్నారు. జార్జ్‌ రెడ్డి క్యారక్టర్‌ను ప్రజలకు చేరవేయడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నామన్నారు. 25 ఏళ్లకే ఓ విద్యార్ధి నాయకుడిగా ఎదగడం స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన జీవిత చరిత్రను తెలుసుకున్నాక ఐదేళ్లు ఏ సినిమా చేయలేదన్నారు దర్శకుడు జీవన్ రెడ్డి. జార్జ్‌ రెడ్డి నిజాయితీని చెప్పేందుకే ఈ సినిమా తీసినట్లు చెప్పారు. తాను తనకంటే కూడా ఎక్కువుగా జార్జ్‌ రెడ్డినే ప్రేమిస్తానన్నారు జీవన్‌ రెడ్డి. జార్జ్‌ రెడ్డి సినిమా ప్రతి ఒక్కరూ చూసి ..ఆయన చరిత్రను తెలుసుకోవాలన్నారు దర్శకుడు జీవన్‌ రెడ్డి.

movie-unit-at-george-reddy-tomb

movie-unit-at-george-reddy-tomb

ఉస్మానియానే ఊపిరిగా బతికాడు జార్జ్ రెడ్డి. ఉస్మానియా ఉద్యమ క్రాంతి కిరణం జార్జ్ రెడ్డి. 25 ఏళ్లకే విద్యార్ధి ఉద్యమ నాయకుడిగా ఎదిగాడు. మార్క్సిజం, సోషలిజం భావాలను గుండె నిండా నింపుకున్న నాయకుడు జార్జ్ రెడ్డి. అందుకే..25 ఏళ్లకే ఉస్మానియాకే లీడర్ అయ్యాడు. విప్లవ గుండెలను తట్టి లేపాడు. జార్జ్ రెడ్డి ఆలోచన విధానం, జార్జ్ రెడ్డి పోరాటాన్ని చిత్ర యూనిట్ నేటి తరాలకు అందించాలనే ఆలోచనతోనే తెర ఎక్కించినట్లు చెబుతున్నారు. జార్జ్ రెడ్డి సినిమాలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినప్పటికీ..వాస్తవికతకు చాలా దగ్గరగా సినిమా తీసినట్లు టాలీవుడ్ లో టాక్.

movie-unit-at-george-reddy-tomb

movie-unit-at-george-reddy-tomb

ఎక్కడో కేళరలో పుట్టి, బెంగళూరులో ప్రాధమిక విద్య పూర్తి చేసుకుని హైదరాబాద్ లో అడుగు పెట్టిన ఓ విద్యార్ధి జీవిత చరిత్రే జార్జ్ రెడ్డి మూవీ. పుస్తకాలను ప్రేమించే వాడు..ఉద్యమాన్ని ఎలా ప్రేమించాడు..ఎందుకు ప్రేమించాడు అనేది మూవీలో చూపించే అవకాశముంది.

movie-unit-at-george-reddy-tomb

movie-unit-at-george-reddy-tomb

జార్జ్ రెడ్డి ఉస్మానియాలోకి అడుగు పెట్టిన తరువాత ఆయనను ఏఏ పరిస్థితులు ప్రభావితం చేశాయి..? నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్రంలో చూడొచ్చు. సినిమాను సినిమాగా చూపిస్తూనే ...ఆదర్శ భావాలు గల విద్యార్ధి ..సమాజం కోసం ఎలా పోరాడాడు అనేది వాస్తవికతకు దర్శకుడు దగ్గరగా చూపించి ఉండొచ్చు.

movie-unit-at-george-reddy-tomb

movie-unit-at-george-reddy-tomb

జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర విన్న తరువాత ఐదేళ్లు ఎటువంటి సినిమా చేయలేదని దర్శకుడు జీవన్ రెడ్డి ప్రకటించాడు. అంటే ..ఈ ఐదేళ్లు ఆయన ఊరక కూర్చొని ఉండరు. జార్జ్ రెడ్డి జీవిత చరిత్రను అధ్యయనం చేసి ఉంటారు. జార్జ్ రెడ్డి గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉంటారు. సో..జార్జ్ రెడ్డి సినిమా నేటి తరాన్ని ఆకర్షిస్తుందని భావిద్దాం.

movie-unit-at-george-reddy-tomb

Next Story