ఇప్ప‌టికిప్పుడు ప‌ద‌వి వ‌దులుకోవ‌డానికి రెడీ - న‌రేష్‌

By Newsmeter.Network  Published on  26 Nov 2019 10:28 AM GMT
ఇప్ప‌టికిప్పుడు ప‌ద‌వి వ‌దులుకోవ‌డానికి రెడీ - న‌రేష్‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు న‌రేష్ ఆ ప‌ద‌విని చేప‌ట్టి దాదాపు సంవ‌త్స‌రం అయ్యింది. అయితే... ఆయ‌న ప‌ద‌వి చేప‌ట్టిన కొద్ది రోజుల్లోనే ఎన్ని గొడ‌వ‌లు జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఎవ‌రితో సంప్ర‌దించ‌కుండా సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని అసోసియేష‌న్ స‌భ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే న‌రేష్ ని ప‌ద‌వి నుంచి దించేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం.. ఇప్పుడు వివాద‌స్ప‌దం అయ్యింది.

ఇదిలా ఉంటే... తెలుగు సినిమా పితామ‌హుడు ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు బ‌యోపిక్ లో న‌రేష్ టైటిల్ రోల్ పోషించారు. బాబ్జి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాల్సింది కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

అయితే ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో న‌రేష్ మాట్లాడారు. అసోసియేష‌న్ లో గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం అనేది స‌హ‌జం. కానీ.. ఏం చేసినా అంద‌ర్నీ కలుపుకునే చేయాలి అనుకుంటాను.. చేస్తున్నాను అని తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ గా ప‌దవి చేప‌ట్టి సంవ‌త్స‌రం అయ్యింది.ఈ సంవ‌త్స‌ర కాలంలో ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామనన్నారు. ఆ విష‌యంలో సంతృప్తిగానే ఉన్నానని తెలిపారు. కాబ‌ట్టి... ఇప్ప‌టికిప్పుడు ప‌ద‌విని వ‌దులుకోవ‌డానికి కూడా రెడీగా ఉన్నాను. కాక‌పోతే న‌న్ను దించేసే అధికారం మాత్రం ఎవ‌రికీ లేదు. ఎందుకంటే.. ఇదేమీ నామినేటెడ్ ప‌ద‌వి కాదు. అసోసియేష‌న్ స‌భ్యులు న‌న్ను ఎన్నుకున్నారు అని నరేష్‌ చెప్పారు.

Next Story