మౌనిక చివరి నిమిషాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 6:28 AM GMT
మౌనిక చివరి నిమిషాలు..!

హైదరాబాద్‌: మౌనిక ..అమీర్‌ పేట్ మెట్రో స్టేషన్ పై పెచ్చులు ఊడిపడి చనిపోయిన టెక్కీ. చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు వరకు కూడా హాయిగా నవ్వుతూ జాలిగా ఉంది. చావు వస్తుందని ఎవరైనా అనుకుంటారా..?అలానే మౌనిక కూడా. తన చావు కొన్ని నిమిషాల్లో ఉందని ఆమెకు తెలియదు. అందుకే ఆమె ముఖంపై నవ్వు. కాని..ఆ నవ్వు చూసి దేవుడికి కూడా ఈర్ష్య కలిగిందేమో. మౌనికను ఈ భూమి మీద ఉంచకూడదని అనుకున్నాడేమో. ఆమెను అర్ధాంతరంగాతన దగ్గరకు తీసుకెళ్లాడు.

కూకట్‌పల్లిలో నివాసముండే మౌనిక టీసీఎస్‌లో వర్క్ చేస్తుంది. చాలా చలాకిగా ఉంటుంది.

డ్యూటీ అయిన తరువాత ఇంటికి చేరుకోవడానికి అమీర్‌పేట్ చేరుకుంది. అప్పుడే వర్షం మొదలైంది. చినుకుల నుంచి తడవకుండా ఉండటానికి అమీర్‌ పేట్ మెట్రో స్టేషన్‌ కిందకు చేరుకుంది. దేవుడి ఇక్కడే దయ చూపలేదు. మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడి..మౌనిక తల మీద పడ్డాయి. బలమైన గాయాలయ్యాయి. మెట్రో సిబ్బంది తేరుకోని మౌనికను ఆస్పత్రికి తరలించేలోగానే ఆమె ప్రాణాలు వదిలింది. అందుకే..ఓ కవి అంటాడు ఏ నిమిషానికి ఏం జరుగునో అని..

Next Story
Share it