కన్నతల్లితో గొడవ.. ఆ తర్వాత డంబెల్ తో..

By రాణి  Published on  27 April 2020 11:09 AM IST
కన్నతల్లితో గొడవ.. ఆ తర్వాత డంబెల్ తో..

మతిస్థిమితం లేని కొడుకు కన్నతల్లితో గొడవపడిన డంబెల్ తో కొట్టి చంపిన సంఘటన కర్నూల్ జిల్లాలోని ఆదోని గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగాబాయ్ అనే మహిళ కొడుకు రాజ్ కిరణ్ తో కలిసి ఆదోనిలోని ఎస్బీఐ 2 కాలనీలో నివాసముంటోంది. రాజ్ కిరణ్ కు కొద్దికాలంగా మానసిక పరిస్థితి బావుండటం లేదు. తరచూ ఏదొక విషయంలో తల్లితో వాదులాడుతూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఏప్రిల్ 25వ తేదీ శనివారం రాత్రి కూడా తల్లితో ఏదో విషయమై గొడవపడ్డాడు.

Also Read : రూ 2.32ల‌క్ష‌ల‌తో 25 ట‌న్నుల‌ ఉల్లి కొని సొంతూరుకు బ‌య‌లుదేరాడు.. చివ‌రికి ఏం జ‌రిగిందంటే..

గొడవ కాస్త పెద్దదై తల్లి రాజ్ కిరణ్ ను మందలించేందుకు ప్రయత్నించిన క్రమంలో పక్కనే ఉన్న డంబెల్ తో తల్లి తలపై కొట్టాడు. ఆ దెబ్బకు గంగాబాయ్ పెద్ద కేక పెట్టి చనిపోయింది. గంగాబాయ్ కేకలు విన్న చుట్టుపక్కలవారు ఏమైందోనంటూ పరుగున వచ్చారు. రక్తపుమడుగులో పడి ఉన్న గంగాబాయ్ ను చూసి పోలీసులకు సమాచారమివ్వగా..రాజ్ కిరణ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Also Read :రిలయన్స్ జియో 25 జీబీ డేటా ఉచితంగా ఇస్తుందా ? వైరల్ మెస్సేజ్ వాస్తవమేనా ?

Next Story