బ్రేకింగ్: బీజేపీలోకి నటుడు మోహన్ బాబు..?..మోదీతో భేటీ
By సుభాష్ Published on 6 Jan 2020 7:36 AM GMTదేశంలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. తాజాగా విలక్షణ నటుడు మోహన్‌బాబు కుటుంబసమేతంగా ప్రధాని మోదీని కలువడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీలోకి రావాలని మోహన్ బాబును మోదీ కోరినట్లు తెలుస్తోంది. మోదీని కలిసిన వారిలో మోహన్‌బాబుతోపాటు మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, కోడలు వెనరోనికా ఉన్నారు. కాగా, మోదీ ఆహ్వానం మేరకు మోహన్‌బాబు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
కాగా, మోహన్‌బాబు త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మోహన్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో ఉన్నారు. మోహన్‌బాబుకు బంధువైన సీఎం జగన్ పార్టీలో ఉంటే ఒరిగేది ఏమిలేదని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కమలం గూటికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ మోహన్‌బాబు బీజేపీలోకి వెళ్తే వైసీపీకి పెద్ద దెబ్బెనని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.