చంద్రబాబును ట్విటర్‌లో చెడుగుడు ఆడిన మోహన్ బాబు...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 4:16 PM IST
చంద్రబాబును ట్విటర్‌లో చెడుగుడు ఆడిన మోహన్ బాబు...!

ముఖ్యాంశాలు

  • ట్విటర్ వేదికగా చంద్రబాబుపై మోహన్ బాబు నిప్పులు
  • తనను క్రమశిక్షణలేని వ్యక్తి అనడంపై మోహన్ బాబు ఆగ్రహం
  • ఈ దేశంలో క్రమశిక్షణలేని వ్యక్తి , స్నేహం విలువ తెలియనివాడు చంద్రబాబేనన్న మంచు

"పడుకున్నదాన్ని లేపి తన్నించుకోవడం" ఈ సామెత తెలుగనాట బాగా ఫేమస్. అంటే..ఎవరైనా సైలెంట్ గా ఉంటే..వారిని గెలుక్కోని తిట్టించికోవడం అన్నమాట. ఈ సామెతను ఇప్పుడు ఎందుకుచెబుతున్నానంటే..చంద్రబాబు నాయుడి ఇప్పుడు ఇదే పని చేశారు. సైలెంట్ గా ఉన్న ఆయన్ని గెలుక్కోని మరీ తిట్టించుకున్నాడు. ఇక్కడ సైలెంట్‌గా ఉంది మోహన్ బాబు. గెలుక్కుని తిట్టించుకుంది ఇంతకీ చంద్రబాబు ఏమన్నాడనే కదా మీ డౌట్. "క్రమ శిక్షణలేని వ్యక్తి మోహన్ బాబు" అని అన్నాడు. అంతే..ఈ విషయం తెలిసిన మోహన్ బాబు ట్విటర్ వేదికగా

చంద్రబాబుపై అక్షరాస్త్రాలు వదిలారు.

మాములేగానే చంద్రబాబు అంటే మోహన్ బాబుకు పడదు. ఎక్కడో వ్యాపార లావాదేవీల్లో తేడాలు వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య సరిగా మాటల్లేవని టాలీవుడ్‌, పొలిటికల్ టౌన్‌లోనూ చెప్పుకుంటూ ఉంటారు. తరువాత ..మోహన్ బాబు వైఎస్ఆర్‌ కుటుంబ బంధువులతో వియ్యం అందడం..వైఎస్ఆర్ సీపీకి దగ్గర కావడంతో చంద్రబాబు - మోహన్‌ బాబుల మధ్య దూరం మరింత పెరిగింది. ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబుపై మోహన్ బాబు రాజకీయ విమర్శనాస్త్రాలు వదిలారు. ఎన్నికల తరువాత మోహన్ బాబు సీన్‌లో ఎక్కడా కనిపించలేదు. మళ్లీ ఇన్నాల్టీకి చంద్రబాబు పుణ్యమా అని ట్విటర్‌లో తన అక్షరాలకు పదును పెట్టారు.

తన మనుసు చంద్రబాబు గాయపర్చారని మోహన్ బాబు ట్విటర్ వేదికగా బాధపడ్డారు. తనను క్రమశిక్షణ లేని వ్యక్తి అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్ఠీఆర్‌, ఏఎన్‌ఆర్, సినీ పరిశ్రమలో ఎవర్నీ అడిగినా తాను ఎంత క్రమశిక్షణ కలిగిన వాడినో చెబుతారన్నారు. ఎన్నికలు అయిపోయి అంతా ప్రశాంతంగా ఉంటే..చంద్రబాబు మంచి వాతావరణాన్ని చెడగొడుతున్నాడని మండిపడ్డారు.

క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్ధం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అదిచంద్రబాబే అన్నారు మోహన్ బాబు. ఏ సందర్భంలోనైనా తన పేరును ప్రస్తావించొద్దు అన్నారు. అదీ..నీకు నాకు మంచిది కాదని సూచించారు. ఎప్పుడైనా ఎదుట పడితే సరదాగా మాట్లాడుకుందాం అంటూ చంద్రబాబుకు చరకలు అంటించారు మోహన్ బాబు. అయితే...చంద్రబాబు ఇప్పుడే ఎందుకు మోహన్ బాబు పేరు ప్రస్తావించారు..?.దీనిలో లాజిక్కు ఏమైనా ఉందా..?. అనే కోణంలో రాజకీయ వర్గాల్లో ఘాటుగానే చర్చ జరుగుతుంది.







Next Story