ట్విటర్ లో మోదీ సరదా సంభాషణ ట్రెండ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 11:56 AM GMT
 ట్విటర్ లో మోదీ సరదా సంభాషణ ట్రెండ్..!

హ్యూస్టన్ : మోదీ ఏం చేసినా సంచలనమే. మోదీ ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ సెనేటర్‌ విషయంలో కూడా మోదీ చెప్పిన క్షమాపణ ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండ్ అవుతుంది. 'హౌడీ మోదీ' కార్యక్రమంలో మోదీ చాలా సరదాగా గడిపారు. సెనెటర్‌ జాన్‌ కార్నిన్‌తో సరదాగా సంభాషించాడు. సెనెటర్ భార్యకు క్షమాపణలు చెప్పాడు. కార్నిన్‌ తన భార్య పుట్టిన రోజు నాడు ఇంట్లో ఉండకుండా 'హౌడీ మోదీ' కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ..ఆయన భార్య ఎక్కడ నొచ్చుకుంటుందేమోనని మోదీ సారీ చెప్పారు. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ..కార్నిన్ దంపతులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మోదీ కోరుకున్నారు.

Next Story