ప్రభుత్వ నిర్ణయం మంచిదైతే ఇంత భద్రత ఎందుకు అంటున్న లోకేష్

By రాణి  Published on  27 Dec 2019 6:12 AM GMT
ప్రభుత్వ నిర్ణయం మంచిదైతే ఇంత భద్రత ఎందుకు అంటున్న లోకేష్

ముఖ్యాంశాలు

  • అమరావతిలో ప్రభుత్వ తీరుపై లోకేష్ ఫైర్
  • రాజధానిని రణరంగంగా మార్చిన ఘనత జగన్ కే దక్కింది

ఆంద్రప్రదేశ్ ను పోలీస్ రాజ్యంగా మార్చడంపై ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అడుగుకో పోలీస్ ని పెట్టారు. ప్రతి ఇంటి దగ్గరా 5గురు పోలీసులా? ముళ్ల కంచెలు, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, లాఠీలు, తుపాకులా? ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు. తీసుకునే నిర్ణయం మంచిదైతే యుద్ధ వాతావరణం ఎందుకు తీసుకొచ్చారో వైకాపా మేధావులు సమాధానం చెప్పాలి. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతి ఉంటుంది, అద్భుతమైన నగరాన్ని కడతామని జగన్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని శాంతియుతంగా రైతులు, రైతు కూలీలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు.''

''ఎన్ని చేసినా కుక్క తోక వంకరే అన్నట్టు ఉంది వైకాపా నేతల వైఖరి. గుంటూరు, కృష్ణా వైకాపా నాయకుల ప్రెస్ మీట్ లో వారి మొహాలు చూస్తేనే అమరావతి నిజమా, గ్రాఫిక్సా అర్ధం అవుతుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు నిరూపించలేక చేతులెత్తేసారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానపర్చారు. ఇప్పడు భూములు ఇచ్చిన రైతులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకొని మాట్లాడుతున్నారు. అమరావతే రాజధాని అని నమ్మ బలికారు, మ్యానిఫెస్టోలో కూడా పెడుతున్నాం అన్నారు. శాసనసభ సాక్షిగా అమరావతికి జై కొట్టారు. అద్భుతమైన రాజధాని కట్టాలి అంటే కనీసం 30 వేల ఎకరాలు ఉండాలి అన్నారు జగన్ గారు. ఇన్ని తెలిసిన @ysjagan గారికి ఆ రోజు రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా?అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు అవుతుంది అందుకే మేము రాజధాని మార్చాము అంటున్న వైకాపా మేధావులకు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని మరోసారి గుర్తు చేస్తున్నా. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వైకాపా గ్రాఫిక్స్ నాయకుల కోసం ఎక్స్ క్లూజివ్ గా అమరావతి నిజస్వరూపం మరోసారి బయటపెడుతున్నా.'' అంటూ ఎమ్మెల్సీ గత రాత్రి, నేటి ఉదయం ట్వీట్ల వర్షం కురిపించారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరును ఎండగడుతూ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. రాజధానిని రణరంగంగా మార్చిన ఘనత జగన్ కే దక్కిందంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.Next Story